Jul 17,2021 12:56

విజయవాడ : పెట్రోల్‌ ధరలు ఈరోజు కూడా పెరిగాయి. సామాన్యుడిపై మరింత భారాన్ని పెంచుతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు ఇలా ఐదు మెట్రో సిటీల్లో ఇప్పటికే పెట్రోల్‌ ధర సెంచరీ దాటేసింది. ఈరోజు దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలను పెంచాయి. ఇలా.. 75 రోజుల్లో 41 వ సారి పెట్రో ధరలు పెరిగాయి.
     దీంతో.. ఢిల్లీలో లీటర్‌ ప్రెటోల్‌ ధర రూ.101.84కి చేరగా, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. ముంబైలో ఒక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.83గా, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 97.45గా ఉంది.. రాజస్థాన్‌లో.. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.21 కాగా.. డీజిల్‌ ధర రూ.103.15గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.102.08, డీజిల్‌ రూ.93.02, చెన్నైలో పెట్రోల్‌ రూ.102.49, డీజిల్‌ రూ.94.39, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.108.71, డీజిల్‌ రూ.99.02, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96గా ఉంది. ఇక, గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.108.6, డీజిల్‌ రూ.99.65గా ఉంటే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.86గా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.99.45గా ఉంది.