ప్రజాశక్తి-పెనుకొండ గెలుపే లక్ష్యంగా పని చేసి పెనుకొండ కోటపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చినట్లు జిల్లా అధ్యక్షలు బికె పార్థసారధి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు చేపట్టిన 'వన్ టూ వన్' కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడలోని చంద్రబాబు నివాసంలో సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె.పార్థసారధి సమావేశమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను చంద్రబాబుకు అంశాల వారీగా వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న స్పందనకు సంబంధించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. . ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ రానున్న ఎన్నికల్లో పెనుకొండ కోటపై టిడిపి జెండా ఎగురవేయడానికి అన్నివిధాలా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారన్నారు. అంతేగాకుండా రానున్న ఎన్నికల సమయం చాలా కీలకమైనదని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలను సంసిద్ధం చేయాలని సూచించారన్నారు.
బికె పార్థసారధితో మాట్లాడుతున్న చంద్రబాబు










