సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘంలో పేదరిక నిర్మూలన కోసం మహిళలకు టైలరింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని పాండురంగ నగర్‌లో శిక్షణ కేంద్రాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు దీన దయాళ్ అంత్యోదయ యోజన, పట్టణ జాతీయ జీవనోపాదుల మిషన్ ద్వారా పురపాలక సంఘంలోని 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇస్తున్నామని. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఎంఎం హరినాథ్‌రెడ్డి, ధనుంజయ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.










