ప్రజాశక్తి-హిందూపురం : పదవ తరగతి ఫలితాలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని పాంచజన్య శ్రీనివాసులు పేర్కొన్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్స్ హై స్కూల్‌లో వసంత పంచమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాంచజన్య శ్రీనివాసులు మాట్లాడుతు ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం పట్టుదలతో శ్రమిస్తే విజయం వెంటే ఉంటుందన్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ డిఎస్ నందకుమార్, ఎఒ భాస్కర్, హెచ్‌ఎం గాయిత్రి, ఎహెచ్‌ఎంలు విజయేంద్ర, శశికళ, ఉపాధ్యాయులు సతీష్, షేక్ రజాక్, ముత్యాలప్ప, ఫ్రాన్సినా, కిర్తి ప్రియ, భారతి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










