May 28,2023 21:08

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ ఆర్డర్‌ చేయడం ఇకపై కష్టంగా అనిపించవచ్చు. దీనికి సంబంధించి ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్స్‌ క్యాబినెట్‌ సెక్రటరీకి లేఖ రాసింది. ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలును నిషేధించాలని ఎఐఒసిడి ఆ లేఖలో డిమాండ్‌ చేసింది. ఆన్‌లైన్‌ మెడిసిన్‌ విక్రేతలు మందుల కొనుగోలు నిబంధనలను సరిగ్గా పాటించడం లేదని కెమిస్ట్‌ బాడీ తెలిపింది. దీంతో ప్రజలు ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. దీని కారణంగా ఆన్‌లైన్‌లో మందుల కొనుగోలు, అమ్మకాలను నిషేధించాలని డిమాండ్‌ చేసింది. ఇంతకు ముందు కూడా ఢిల్లీ హైకోర్టు ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను నిషేధించింది. హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఇ-ఫార్మసీలు లైసెన్స్‌ లేని మందులను ఆన్‌లైన్‌లో విక్రయించడాన్ని నిషేధిస్తూ 2018 ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను లేఖలో ఉదహరించారు. కోర్టు ఆదేశాలు ఉనుప్పటికీ, అనేక ఇ-ఫార్మసీలు ఆన్‌లైన్‌లో మందుల విక్రయానిు కొనసాగించాయి. ఎఐఒసిడి కూడా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తును ఇ-ఫార్మసీ 4.5 సంవత్సరాలకుపైగా మందులను విక్రయిస్తోందని తెలిపింది.

  • ఐటి చట్టాన్ని కంపెనీలు పాటించడం లేదు

ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించడానికి చాలా కంపెనీలకు లైసెన్స్‌ కూడా లేదని ఎఐఒసిడి లేఖలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఔషధాలను విక్రయించాలంటే కంపెనీలు ఐటి చట్టాల నిబంధనలను పాటించాలి. చాలా కంపెనీలు పాటించడం లేదు. దీంతో ఆన్‌ లైన్‌ విక్రయాలపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. ఇటీవల డ్రగ్‌ కంట్రోలర్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 20 ప్రసిద్ధ ఆన్‌లైన్‌ ఫార్మసీలకు నోటీసులు జారీ చేసింది.