Jul 16,2021 18:03

హైదరాబాద్‌ : ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ నెటిజన్లపై ఫైర్‌ అయింది. ఆమె ఫైర్‌ అవ్వడమే కాదండోరు నెటిజన్లకు స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది. ఎప్పుడూ నెట్టింట్లో తన ఫొటోలతో సందడి చేసే ఈ హీరోయిన్‌.. అంత ఫైర్‌ అవ్వడానికి కారణమేమింటబ్బా అని అనుకోకండి. అసలు విషయానికొస్తే.. తనకు సంబంధించిన ఫొటోలపై స్పందిస్తూ.. 'ఇటీవలి కాలంలో నాకు సంబంధించిన ఈ ఫొటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్‌ అవుతూనే ఉంది. ఇది నాకు నచ్చడం లేదు. వాస్తవానికి ఆ ఫొటోకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయినా సరే నెటిజన్లు ఆ ఫొటోలను పదే పదే షేర్‌ చేస్తే.. అవి చీప్‌ పనులే అవుతాయి. ఆ స్థాయికి దయచేసి దిగజారకండి' అంటూ నెటిజన్లనుద్దేశించి అన్నారు. అయితే ఇంతకీ ఆమె అంతలా ఫైర్‌ కావడానికి కారణమైన ఫొటో మాత్రం చెప్పలేదు.
ప్రస్తుతం నిధి అగర్వాల్‌ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సరసన హరిహరవీరమల్లు సినిమాలో నటిస్తోంది. అలాగే అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న 'హీరో' చిత్రంలో నటిస్తున్నారు.