Apr 19,2023 12:03

ఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,542 కరోనా కేసులు నమోదు కాగా, 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 8175 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. కరోనా కేసులతో పాటు మృతుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉంది. ఇప్పటి వరకు 5,31,190 మంది మృతి చెందగా,  63,562 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లుగా ఉంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది.