Feb 26,2023 16:19
  • ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ 

ప్రజాశక్తి-కలకడ : ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ కోరారు.ఆదివారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం.ఎల్.సి ఎన్నికలు సందర్భంగా ఎన్నికల కోడు ఉన్నందువల్ల మండల సర్వసభ్య సమావేశాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించలేక పోతున్నామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మండల సర్వసభ సమావేశాన్ని తూతూ మంత్రంగా నిర్వహించడం జరిగిందని పలువురు విమర్శలు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ కమలాకర్ రెడ్డి, ఎంపీడీవో సిహెచ్ నారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.