Oct 12,2022 15:03

ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అవ్వ తాతలను, అక్కా చెల్లెమ్మలను, గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అండగా ఉన్నానని భరోసా ఇస్తూ, వారి కష్టాలను విని వారికి ఆపన్న హస్తం అందజేస్తూ ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ముందుకు సాగుతున్నారు. పేదల కష్టాలు తెలుసుకుని దానికి అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగనన్నకు, ఎమ్మెల్యే కృష్ణప్రసాదుకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.