May 10,2023 13:51

ప్రజాశక్తి-చందర్లపాడు :   చందర్లపాడు మండలంలోని ముప్పాళ్ళ గ్రామంలో రూ.కోటి 60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 5 MVA సామర్థ్యం గల 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని అందజేసిన దాతలు వంకాయలపాటి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా శాలువతో సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. ముప్పాళ్ళ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం వలన పరిసర గ్రామాలైన గుత్తవారి పాలెం, అడవిరావులపాడు, కేతవీరునిపాడు, మునగాలపల్లి గ్రామాలలో వోల్టేజ్ సమస్య పరిష్కారం కావడంతో పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు. అదేవిధంగా పరిసర గ్రామాల వ్యవసాయ భూములకు -పారిశ్రామిక కేంద్రాలకు కూడా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో ముప్పాళ్ళ పరిసర ప్రాంతాలకు చందర్లపాడు సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా జరిగేదని, ఈ ప్రాంతంలో సుబాబుల పంట ఎక్కువగా ఉండటం వలన విద్యుత్ తీగల కు సుబాబులు తగులుతుండటంతో విద్యుత్ సరఫరా లో అవాంతరాలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, నేడు ముప్పాళ్ళ గ్రామంలోనే సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. మూడు నెలల్లోగా సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  అధికారులకు సూచించారు.సమస్య తెలిపిన వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులలో - స్థల సేకరణలో వేగవంతంగా స్పందించిన విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే డాక్టర్  జగన్ మోహన్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ జి భార్గవ శ్రీనివాసరావు, ఏడీఈ రమేష్ బాబు, ఏఈ పూర్ణచంద్రరావు, ఏడీఈ ప్రభు, ఏఈ దిబ్బయ్య, ఎంపీటీసీ నల్లాని రమాదేవి సాయి, సొసైటీ అధ్యక్షులు నల్లాని అయ్యన్న, బండారుపల్లి కపిల్, వేల్పుల ప్రసాద్, ఉసికల వెంకట్రావు, కొనకంచి వెంకట్రావు, చందు, మండల కన్వీనర్ కందుల నాగేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..