Jan 24,2023 22:21

అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

మడకశిర : గుడిబండ మండలం కుమ్మర నాగేపల్లిలోనిప్రాథమిక పాఠశాల సమీపంలోని దళితవాడ కాలనీ వద్ద మట్కా నిర్వాహకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ హుస్సేన్‌ పీరా తెలిపారు. పక్కా సమాచారంతో తమ శాఖ సిబ్బంది మెరుపు దాడి చేసి ఏడుగురు మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగానే కుమ్మర నాగేపల్లికి చెందిన రాజ్‌ కుమార్‌ నుండి రూ. 1.30 లక్షలు, ఇదే గ్రామానికి చెందిన కల్లి నారాయణప్ప నుండి రూ.9వేలు, ఇరేతూర్పు గ్రామానికి చెందిన తిప్పేస్వామి నుండి రూ. 18వేలు, కుగిరిన పాళ్యం గోవిందరాజుల నుండి రూ. 17,500. అదే కాలనీకి చెందిన రాజు నుండి రూ. 9,500, అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన నరసింహమూర్తి నుండి రూ. 9,700, ఇరేతూర్పి గ్రామానికి చెందిన సిద్ధప్ప నుండి రూ.7.350లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం మీద ఏడుగురు నిర్వాహకుల నుండి ఈ నగదు తో పాటు వారికి ఏడు సెల్‌ ఫోన్లు, మట్కా పట్టీలను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న సిఐ సురేష్‌ బాబు, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్‌, సిబ్బంది వెంకటేష్‌, దిలీప్‌ , లక్ష్మీకాంత్‌ ,మహమ్మద్‌ రఫీ ,మంజునాథ్‌, నవీన్‌ను ఈసందర్భంగా డీఎస్పీ అభినందించారు.