Jul 15,2021 18:40

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియాలో జరిగిన నలభీముల పోటీల్లో ప్రవాస భారతీయుడు జస్టిస్‌ నారాయణ్‌ విజేతగా నిలిచారు. చెఫ్‌ పోటీల్లో విజేతగా నిలిచిన నారాయణ్‌ సీజన్‌ -13 మాస్టర్‌ చెఫ్‌ ఆస్టేలియా టైటిల్‌తోపాటు రూ. 1.86 కోట్ల నగదు బహుమతి గెలుచుకున్నారు. భారత సంతతికి చెందిన వారిలో శశి చెల్లయ్య తర్వాత ఈ టైటిల్‌ను గెలిచిన రెండో వ్యక్తి నారాయణ్‌ కావడం విశేషం. పెర్త్‌లో నివసిస్తున్న నారాయణ్‌.. భారత్‌, ఫిజీ మూలాలున్నవారు. భారతీయ వంటకాలైన పికిల్‌ సలాడ్‌, ఫ్లాట్‌ బ్రెడ్‌, చికెన్‌ కర్రీ, చేపల కూర వంటి వంటకాలను న్యాయనిర్ణేతలకు రుచి చూపించి.. టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ పోటీలో మరో ప్రవాస భారతీయుడు కిశ్వర్‌ చౌదరి.. బెంగాలీ రుచులను న్యాయనిర్ణేతల ముందుంచారు. జస్టిస్‌ నారాయణ్‌ విజేతగా నిలవగా.. తర్వాత రెండు స్థానాల్లో కిశ్వర్‌ చౌదరి, పీటే కాంప్‌బెల్‌లు నిలిచారు. ఈ పోటీల్లో ప్రముఖ చెఫ్‌ దిపీందర్‌ చిబ్బర్‌ కూడా పాల్గొన్నారు.

chef 5