మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదు - కలెక్టరేట్ వద్ద ఎపిడబ్ల్యూజెఎఫ్ ధర్నా
కడప అర్బన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై డాక్యుమెంటరీ విడుదల చేసిన బిబిసిపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటి దాడులు చేయి ంచడం శోచనీయమని, మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని ఆంద్ర óప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపి డబ్ల్యుజెఎఫ్) నాయకులు అన్నారు. మీడియా స్వేచ్చను కాపాడాలని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద మీడియా ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2002లో గుజరాత్ మత మారణహోమంలో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్ర మోడీ పాత్రను బయట పెట్టినందుకు బిబిసి వార్తా ఛానల్ పై కేంద్రం వేధింపులకు దిగిందన్నారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఢిల్లీలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను అధికారులు సెర్చ్, సర్వే పేరుతో దాడులకు దిగడం పత్రికా స్వేచ్ఛపై పరోక్ష కక్ష సాధింపుకు పాల్పడ డమేనన్నారు. ప్రధాని మోడీ నిజ స్వరూపాన్ని బయటపెట్టినందుకు ఇప్పటికే బిబిసి డాక్యుమెంటు లింకులను సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని నిషే ధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ఆ వార్తా ఛానల్ పైనే దాడులకు దిగిందన్నారు. భావ ప్రకటనా స్వేఛ్చపై ఉక్కుపాదం మోపుతున్న నరేంద్ర మోడీ చర్యలను అందరూ ఖండించాలని వారు పిలుపునిచ్చారు. మీడియా స్వేచ్ఛను హరించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైందని, హక్కులను హరించాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఎఒ విజ రుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు నారాయణ, రాఘవులు, సూరిబాబు, రాజు, నూరుబాషా, సిద్దయ్య, సి. ఎస్. ప్రసాద్, బాలకష్ణ, సుదర్శన్, దుర్గాప్రసాద్, రవికుమార్, బ్రహ్మానందరాజు, నాగార్జున, ప్రభాకర్ రెడ్డి, అశోక్ కుమార్, భాస్కర్ రెడ్డి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.










