ముంబయి : రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు, బాలీవుడ్ నటి కంగనారనౌత్‌కు మధ్య ట్వీట్ల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ నుండి ముంబయికి బయలుదేరిన ఆమె మరోసారి మహారాష్ట్ర ప్రభుత్వంపై ట్వీట్ చేశారు. ''నేను చెప్పినట్లుగానే ముంబయికి బయలుదేరాను. అయితే నాకంటే ముందే మహారాష్ట్ర ప్రభుత్వం, వారి గూండాలు నా ఆఫీస్, నివాసాన్ని చట్టవిరుద్ధంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు'' అని ట్వీట్ చేశారు. '' కానీయండి, మహారాష్ట్ర ప్రభుత్వ అహంకారం కోసం నా రక్తమివ్వడానికైనా సిద్ధంగానే ఉన్నానని ముందే ప్రకటించాను. అన్నీ కూల్చేసినా.. నా భావాలు నాకు ఉన్నాయి'' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.










