Nov 09,2023 15:42

విశాఖ: నిన్నటి వరకు 'మా నమ్మకం నువ్వే జగన్‌' అని అన్న ప్రజలు బుధవారం 'నిన్ను నమ్మం జగన్‌' అని ప్రజలు అంటున్నారని టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ట్విటర్‌ వేదికగా గంటా శ్రీనివాసరావు 20 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ రాశారు.
''గడపగడపకూ వైసిపి అన్నారు. గడపగడపలో అవమానంతో వెనుదిరిగారు. ఇప్పుడు 'వై ఏపీ నీడ్స్‌ జగన్‌' అనే కొత్త పల్లవి అందుకొన్నారు. ప్రజలు 'ఏపీ హేట్స్‌ జగన్‌' అనే స్వరం అందుకున్నారు. వద్దు వద్దు ఈ జగన్‌.. మళ్లీ మాకొద్దు ఈ జగన్‌.. అనే నినాదంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని మీ మూర్ఖపు పాలనతో అధోగతిపాలు చేసి.. అగమ్యగోచరంలోకి నెట్టేసినందుకా.. ఈ రాష్ట్రానికి మీరు అవసరం..? నవరత్నాలు నవమోసాలుగా చేసి.. ఏ ఒక్క రత్నాన్ని కూడా సక్రమంగా అమలు చేయనందుకా ఈ రాష్ట్రానికి మీరు అవసరం? ఈ 20 ప్రశ్నలకు జగన్‌ రెడ్డి, మంత్రులు, సలహాదారులు.. మీలో ఎవరైనా సమాధానం చెప్పగలరా?'' అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.