పీలేరు : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పి ధరలకే మద్యాన్ని అమ్ముతున్నారా లేదా అనే విషయమై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చిత్తూరు మద్యం డిపో ఎస్‌ఐ రామకష్ణశాస్త్రి తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ దయాసాగర్, డిపో ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వం నిర్ణయించిన ధరలకన్నా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారా అనే విషయమై గుర్తు తెలియని వ్యక్తులను షాపులకు పంపి డెకారు ఆపరేషన్ నిర్వహించారు. ఎక్కడా అధిక ధరలకు అమ్మడం లేదని గుర్తించినట్లు చెప్పారు. సిబ్బంది ఏదైనా పొరబాట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. చదువుకున్న వారు భవిష్యత్తులో చట్ట పరమైన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్దేశిత ఆదేశాలను అతిక్రమించకుండా ఉండాలని తెలిపారు.










