ప్రజాశక్తి-నెల్లూరు : జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని గాంధీ బొమ్మ సెంటర్లో వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని తీసుకోరావడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దళితుల మీద సామాన్యుల మీద దాడులు జరుగుతున్నాయని ప్రజల వైపు నిలబడి మాట్లాడడం తప్ప అని ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని వామపక్ష నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ఎల్లం వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా నాయకులు రామరాజు పాల్గొన్నారు.










