Jul 15,2021 10:15

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల దిశగా పయనించాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 53వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 15,800ను దాటింది. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 53,024 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 15,885 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీరంగాల్లోని షేర్ల కొనుగోళ్లతో స్టాక్‌ మార్కెట్లు లాభాలు అందుకున్నాయి. ఎస్‌అండ్‌ పిబిఎస్‌ఇ ఇండిస్టియల్స్‌, ఐటి, ఆరోగ్యరంగం సూచీలు కూడా 0.3 నుండి ఒక్క శాతం పెరిగాయి. విద్యుత్‌, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. విప్రో, రిలయన్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సి లైఫ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టైటాన్‌, ఐటిసి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు నష్టాల్లో కొన సాగుతున్నాయి. మొత్తానికి స్టాక్‌ మార్కెట్‌లో 1,761 షేర్లు సానుకూల దిశలో పయనించాయి.