ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెండు తెలుగురాష్ట్రాల మద్య జలజగడంకు ఫుల్‌స్టాఫ్ పడనుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్యాల బోర్డుల పరిధులను కేంద్రం ఖరారు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులపై రెండు గెజిట్ నోటిఫికేషన్లను శుక్రవారం కేంద్రం విడుదల చేయనుంది. అలాగే ప్రాజెక్టుల నిర్వహణ, క్రమబద్ధీకరణ, సంరక్షణలపై ఇరు రాష్ట్రాల పరిధులను కేంద్రం స్పష్టం చేయనుంది. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కెఆర్‌ఎంబిని నోటిఫై చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసారు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం కఅష్ణా నది యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి), గోదావరి నది యాజమాన్య బోర్డు (జిఆర్‌ఎంబి) పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నా ఏడేళ్లపాటు కేంద్రం నాన్చివేత దోరిణిని అవలంబించడంతో రెండు రాష్ట్రాల మద్య ఇటీవల కాలంలో జలవివాదాలు తీవ్రమయ్యాయి. రెండు ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేసుకుంటూ సుప్రీంకోర్టు దాకా వెల్లాయి. కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి పరిదిని నిర్దేశించేందుకుగాను 2020 అక్టోబరు 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల్‌శక్తి మంత్రితో కూడిన అపెక్స్ కమిటీ సమావేశమైనప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం బోర్డుల పరిదిని ó నిర్దేశించే అధికారం కేంద్రానికి ఉంటుందని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. గజెట్ నోటిఫికేషన్‌తో కృష్ణా, గోదావరి నదుల్లోని నీటివాడకంపై ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణాకు ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది.










