క్రీడాసామగ్రితో నాయకులు, విద్యార్థులు
ధర్మవరం టౌన్ : పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో జిల్లా క్రీడాసాధికార సంస్థ ఆధ్వర్యంలో హాకీ క్రీడాకారులకు క్రీడాసామాగ్రిని మంగళవారం అందజేశారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా హాకీ అసోషియేషన్ కార్యదర్శి బంధం సూర్యప్రకాశ్, కోచ్ హస్సేన్, ధర్యాంబ హాక్ అసోషియేషన్ సెక్రటరీ జెన్నేచంద్రశేఖర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.










