కదిరి టౌన్ : కరాటే సాధనతో శారీరక దృఢత్వం పెంపొందుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరి బార్సు హై స్కూల్ లో కియో జపాన్ షాటోకాన్ కరాటే డు అసోసియేషన్ ఇండియా ఆధ్వర్యంలో మాస్టర్ అక్బర్ అలీ నిర్వహించిన కరాటేబెల్ట్ పరీక్షలు జరిగాయి. పంచస్ కిక్స్ బ్లాకింగ్స్ , సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, నాంచాక్ రొటేషన్, టైల్స్ బ్రేకింగ్ కథస్ తదితర వాటిని విద్యార్థులు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎల్లో బెల్ట్ సనత్ సోగంద్ , గ్రీన్ బెల్ట్ ఆఫసా శైలజ, రామ్ చరణ్, దీక్షిత్, నవాజ్ సాధించారు. పర్పుల్ బెల్ట్ నాజీష్ సాధించగా, బ్రౌన్ బెల్ట్ షోహెబ్ సాధించాడు. వీరందరికీ కందికుంట నివాసంలో ఆయన చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ కరాటే సాధనతో శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పాల్గొని విజయాలు సాధించాలని పిల్లలకు సూచించారు. ఈసందర్భంగా మాస్టర్ అక్బర్ అలీని అభినందించారు ఈ కార్యక్రమంలో కరాటే కోచ్‌లు రియాజ్ అలీ ఖాన్, వసుంధర, మొహమ్మద్ రఫీ, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










