విజయవాడ : కొడుకు తాగుతున్నాడని అతని స్నేహితుడిని నిలదీసినందుకు సదరు స్నేహితుడు ఆమెను పొడిచి చంపిన దారుణఘటన శనివారం తెల్లవారుజామున విజయవాడలో చోటుచేసుకుంది.
స్థానిక వివరాల మేరకు.. రెడ్డిగారికోట కు చెందిన ఓ మహిళ కుమారుడు, అతని స్నేహితుడు హరికృష్ణ లు రోజూ మద్యాన్ని సేవిస్తుండేవారు. ఈ విషయం తెలిసిన తల్లి తన కుమారుడి స్నేహితుడు హరికృష్ణ ను నిలదీసింది. తనను నిలదీసిందన్న కోపంతో హరికృష్ణ, ఆమెపై రెండు కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి చంపాడు. తీవ్రగాయాలతో ఉన్న మహిళను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తీవ్రరక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు మహిళను హత్య చేసిన సమయంలో మద్యాన్ని సేవించడంతోపాటు గంజాయిని కూడా సేవించినట్లు పోలీసులు గుర్తించారు. హరికృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.










