Oct 17,2023 15:27

వరంగల్‌ : తన బిడ్డ చావుకు కారణమైన నిందితునికి ఉరిశిక్ష వేయాలని మర్రి ప్రవళిక తల్లి విజయ డిమాండ్‌ చేసింది. మీ రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగకండి.. మమ్మల్ని టార్చర్‌ పెట్టకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు.''రెండు సంవత్సరాల నుంచి తన బిడ్డను హైదరాబాద్‌లో చదివించుకుంటున్నానని విజయ తెలిపారు. నా కుమారుడు కూడా అక్కడే చదువుకుంటున్నాడు. ఎండల కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నాం. మా పిల్లలకు ఆ కష్టం రాకూడదు అని అక్కడ పంపి చదివిపిస్తున్నాం. కానీ, వాడు మా పిల్లను వేధించాడు. వాడి టార్చర్‌ భరించలేక మా అమ్మాయి కనీసం మాతో కూడా చెప్పుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడిని బయటకు రాకుండా చేయాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రాకూడదు. మీకు పార్టీల పరంగా ఏమైనా గొడవలు ఉంటే మీరు చూస్కోండి అంతే కానీ మా కుటుంబాన్ని అందులో లాగకండి. నా బిడ్డను చావుకు కారణమైన వాడిని మాత్రం బయటకు రానీయకండి.. వాడికి శిక్ష వేయండి'' అని ప్రవళిక తల్లి విజయ డిమాండ్‌ చేసింది.