Jun 16,2023 14:32

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను జూన్‌ 30కి వాయిదా వేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు శుక్రవారం సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురి నిందితులకు రిమాండ్‌ పొడిగించింది.