Jan 26,2021 23:11

సాయిరాజ్‌కు వివరిస్తున్న జోహార్‌ ఖాన్‌, శివాజీ

కవిటి: కొబ్బరి బోర్డును నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌లో విలీనం చేయకుండా అడ్డుకోవాలని కొబ్బరి బోర్డు చైర్మన్‌ జోహార్‌ ఖాన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆరింగి శివాజీ డిసిఎంఎస్‌ చైర్మన్‌, వైసిపి నియోజకవర్గ సమ న్వయకర్త పిరియా సాయిరాజ్‌ని కోరారు. మంగళవా రం బల్లిపుట్టుగలోని సాయిరాజ్‌ నివాసంలో ఆయనను కలిసిన బోర్డు సభ్యులు ఎపి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ విలీనం ప్రక్రియను అడ్డుకోవాలని కోరారు. ఈ విలీనం ద్వారా ఎంతోమం ది కొబ్బరి రైతులకు అన్యాయం జరుగుతుందని, రైతు అభివృద్ధి దృష్ట్యా కొబ్బరి బోర్డు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉండాలని వీరు వివరించారు. ప్రస్తుతం కొబ్బరి బోర్డు కేరళలో ఉందని, దాన్ని నేషనల్‌ హార్టీకల్చర్‌ మిషన్‌లో విలీనం చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నట్టు బోర్డు సభ్యులు సాయిరాజ్‌కు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి కొబ్బరి రైతుల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.బి.వెంకటరమణ, బి.చంద్రశేఖర్‌, జి.రాజు, ఎస్‌.కృష్ణారావు పాల్గొన్నారు.