Dec 20,2020 08:08

మన నేల మన చెమట
పోరాడుతున్న వేళ
ఉనికి కోసం భవిత కోసం
ఉద్యమానికి ఊపిర్లందిస్తున్న
భారత భాగ్యవిధాతలు..
తరతరాల ఈ దేశ చరితలో
ఇదో మహోజ్వల ఘట్టం!
రాజ్యమే మన పీక కోసే
చట్టాల కత్తి నూరుతుంటే
మన వ్యవసాయం
మన పంట
మనమే కొత్తగా జేబుకి చిల్లు
పెట్టుకొని మరీ కడుపు
నింపుకోవాల్సిన అగత్యం..
ముఖమల్‌ ముసుగులో
ధృతరాష్ట్ర కౌగిలిలా
వికాటాట్టహాసం చేస్తుంటే
ఆ చట్టాల పద్మవ్యూహాల్ని
తుత్తుతునియలు చేద్దాం..
ఉద్యమం ఊపు తగ్గకుండా
అన్నదాతల వెన్ను కాచి
నిజానిజాలు కుండ బద్దలు
కొడదాం రండి.


- భీమవరపు పురుషోత్తం
సెల్‌ : 99498 00253