ప్రజాశక్తి-కాకినాడ : ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ఏచూరి కల్పకం 'పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గబారు దేశ్‌ముఖ్' అవార్డుకు ఎంపికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గాంధీనగర్ పార్క్‌లోని గ్రంథాలయంలో ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, కాకినాడ విభాగం ఆధ్వర్యాన గురువారం వర్చువల్ విధానంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గాంధీ ఆశయాల కోసం పని చేసిన దుర్గాభారు దేశ్‌ముఖ్ కాకినాడకు చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. దేశ్‌ముఖ్ స్ఫూర్తితో కాకినాడలో ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించడంలో కల్పకం కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఆమెకు అవార్డు అందించడం అభినందనీయమన్నారు. అవార్డు గ్రహీత ఏచూరి కల్పకం మాట్లాడుతూ తనను ఎంతో అభిమానిస్తూ.. దుర్గాభాయి దేశముఖ్ అవార్డును ప్రదానం చేయడం పట్ల ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్, కాకినాడ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షులు షీలా ఖక్కడె, ఉపాధ్యక్షులు చంద్రప్రభజోష్, సభ్యులు పాల్గొన్నారు.










