ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్ : కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని జిందాల్ స్టీల్ వర్క్ మేనేజ్మెంట్ ఇద్దరు జపనీస్ వారితో కలిసి బుధవారం ఉదయం సందర్శించారు. ఈ మేరకు ఆర్డిఓ శ్రీనివాసులు వారికి స్వాగతం పలికారు. మండల పరిధిలోని సున్నపురాల పల్లె మాజార కన్నెతీర్థం వద్ద ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి జిందాల్ వారితో రెండవ సారి శంకుస్థాపన చేసిన ప్రదేశంలో స్థలాన్ని చూపించి వారికి కావలసిన సమాచారం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ అధికారులు, వైసీపీ నాయకుడు మల్కిరెడ్డి హనుమంతు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










