ప్రజాశక్తి-హిందూపురం అనాదిగా గ్రామాల్లో కాటి కాపర్లుగా పని చేస్తున్న వారందరినీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. సోమవారం కెవిపిఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటికాపర్లు గ్రామాల్లో తరతరాల నుంచి ఎవరు మృతి చెందినా వారి శవాలను గుంతలు తీసి, పూడ్చి సేవలను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం వీరిని గుర్తించి నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, వీరికి అవసరమైన గుర్తింపు కార్డులు, ఏకరూప దుస్తులతో పాటు సేఫ్టీ డ్రెస్, గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కార్యదర్శి మధు, కాటికాపర్ల సంఘం అధ్యక్షులు సూగూరు గోపాలప్ప, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు నారాయణప్ప, రామాంజి, నరసింహప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న కెవిపిఎస్ నాయకులు










