ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను కలిపి అభిమానులు త్వరలో ఓ బుల్లితెర కార్యక్రమంలోనూ చూడనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కార్యక్రమం జెమిని టీవీ చానల్లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ప్రారంభ ఎపిసోడ్‌కు గెస్టుగా రామ్ చరణ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, దర్శకధీరు తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్'కు సంబంధించి రోర్ ఆఫ్ ఆర్‌ఆర్‌ఆర్ పేరుతో మేకింగ్ వీడియోను ఇవాళ ఉదయం విడుదల చేశారు. అదిరిపోయేలా ఉన్న ఈ వీడియోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ దుమ్ములేపేశారు. ఇక ఇందులో శ్రియా, అజరు దేవగణ్, అలియా భట్ ఇలా అందరినీ చూపించారు. యాక్షన్ సీక్వెన్‌లు ఎలా ఉండబోతోన్నాయో చిన్న ఉదాహరణగా ఈ వీడియో ఉంది. నెవ్వర్ బిఫోర్ అనేలా ఇండియన్ స్క్రీన్ మీద రాజమౌళి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్, ఆ ఇద్దరూ కలిసి చేసే యాక్షన్ సీక్వెన్స్, అందుకోసం భారీ ఎత్తున వేసిన సెట్లు, వందల మంది యుద్ద సన్నివేశాలు అదిరిపోయేలా ఉన్నాయి. మొత్తానికి 'ఆర్‌ఆర్‌ఆర్' గర్జన మాత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది. ముందు ప్రకటించిన మాదిరిగానే అక్టోబర్ 13న ఈ మూవీ రాబోతోంది.










