Nov 27,2022 21:46

ఫుట్‌పాత్‌మీద జరుగుతున్న వ్యాపారాలు

ప్రజాశక్తి. పుట్టపర్తి అర్బన్‌ : సత్యసాయి జయంతి వేడుకలు సందర్భంగా ఫుట్‌ పాత్‌ పై పలు దుకాణాలు వెలిశాయి. పట్టణంలోని విద్య గిరి నుంచి ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల వరకు వివిధరకాల వస్తువులు బెలూన్లు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, బంతులు, షట్టర్లు, రబ్బర్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ వస్తువులు ఇలా పెద్దలకు పిల్లలకు ఉపయోగపడే వస్తువులు విక్రయిస్తున్నారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉదయం సాయంత్రం వీటిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈనెల 18 నుంచి 24 వరకు జయంతి ఉత్సవాలు జరిగిన విషయం విధితమే. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు తమ వస్తువులు విక్రయించుకోవడానికి పలువురు వచ్చారు. వ్యాపారాలు ఎలా ఉన్నాయని వ్యాపారులను విచారించగా పరిసర గ్రామాల ప్రజలు, మహిళలు, పిల్లలు వస్తువులను కొనటానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. తమకు కూడా గిట్టుబాటు అవుతోందని మరో వారం పది రోజులపాటు తమ వ్యాపారాలు కొనసాగుతాయని తెలిపారు.