Feb 25,2023 20:09

ఎమ్మెల్యే చింతలను సన్మానిస్తున్న ఎస్‌సి విభాగం జిల్లా అధ్యక్షులు రవీంద్ర

ప్రజాశక్తి-వాల్మీకిపురం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి సాధ్యమని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. వైసిపి అనుబంధ ఎస్‌సి విభాగం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మద్దెల రవీంద్ర శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని కలుసుకొని పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలవతో సన్మానించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి ఇచ్చిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి విజయం కోసం అహర్నిశలు శక్తివంచన లేకుండా పని చేస్తానన్నారు. ఎస్‌సిల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు కేశవరెడ్డి, రఘు, రాయుడు, సుధాకర్‌, వెంకటస్వామి, మహేష్‌, నాగార్జున, రమణ పాల్గొన్నారు.