Jan 23,2023 21:37

విద్యార్థినిని అభినందిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - హిందూపురం : పట్టణంలోని మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఫార్మసి విభాగంలో విధ్యనభ్వసించిన మహమ్మద్‌ ముస్కాన్‌ బాను జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధించి, మొదటి స్థానం దక్కించుకోవడం అభినంద నీయమని కళాశాల ప్రిన్సిపల్‌ హరీష్‌బాబు తెలిపారు. ఈ మేరకు సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహమ్మద్‌ ముస్కాన్‌ బానుకు జ్ఞాపికను అందించిసన్మానించారు. ఈ సందర్బంగా ముస్కాన్‌ తల్లిదండ్రులు యాస్మిన్‌, రహంతుల్లా మాట్లాడుతు తన కుమార్తె చిన్న తనం నుంచి చదువులో బాగా రాణించందన్నారు. తమ కుమార్తెకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు టి శ్రీనివాసులు, విబిఎస్‌ఆర్‌ఎల్‌ శర్మ, సుమతి, రాజశేఖర్‌, ఫరూక్‌, సత్య కీర్తి, పాణి తదితరులు పాల్గొన్నారు.