ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్ జిల్లా): ఇబ్రహీంపట్నంలోని అన్నమ్మ వికలాంగుల సేవా సంస్థ ప్రధాన కార్యాలయంపై ఐసిడిఎస్, చైల్డ్ లైన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు దాడులు గురువారం కూడా కొనసాగాయి. రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ సభ్యులు సీతారాం, రాజేంద్రప్రసాద్ తనిఖీలు చేస్తున్నారు. సేవా సంస్థ ముసుగులో విద్యార్థులపై దాడులను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ధర్నాకు దిగారు. విద్యార్థులను వేదింపులకు గురి చేస్తున్నారంటూ స్థానికులు ఆరోపణ చేశారు.










