- రోహిత్, కోహ్లికి విశ్రాంతి
- వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు జట్టు ఇదే!
ముంబయి: వెస్టిండీస్‌తో జరిగే ఐదు టి20ల సిరీజ్‌కు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మతోపాటు వికెట్ కీపర్ సంజు శాంసన్‌కు చోటు దక్కింది. బిసిసిఐ సెలెక్షన్ కమిటీ సభ్యునిగా అజిత్ అగార్కర్ ఎన్నికైన కొద్ది గంటలకే విండీస్ టూర్‌కు 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. విండీస్‌తో టి20 సిరీజ్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి నిచ్చింది.
జట్టు: హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్(వికెట్ కీపర్లు), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోరు, ఆర్ష్‌దీప్ సింగ్, ఉమ్రన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.
- టి20 షెడ్యూల్...
ఆగస్టు 3: తొలి టి20(ట్రినిడాడ్)
ఆగస్టు 6: రెండో టి20(గయానా)
ఆగస్టు 8: మూడో టి20(గయానా)
ఆగస్టు 12: నాల్గో టి20(ఫ్లోరిడా)
ఆగస్టు 13: ఐదో టి20(ఫ్లోరిడా)










