Apr 19,2023 21:40
  • ఐసిసి టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) తాజా టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 960పాయింట్లతో టాప్‌లో ఉండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్తాన్‌) 798పాయింట్లు రెండోస్థానంలో ఉన్నాడు. అలాగే భారతజట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 15వ స్థానంలో ఉండగా.. బౌలర్ల జాబితాలో ఎడమచేతి పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 14వ ర్యాంక్‌లో నిలిచాడు. ఇక టాప్‌లో పాకిస్తాన్‌కు చెందిన షాదాబ్‌ ఖాన్‌ ఉండగా.. రవూఫ్‌ 12వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో రవూఫ్‌ 3టి20ల్లో ఐదు వికెట్లు తీయడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. ఇక భువనేశ్వర్‌ కుమార్‌ 19వ, హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్ల జాబితాలో 2వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌ చెందిన షకీబ్‌-అల్‌-హసన్‌ టాప్‌లో ఉన్నాడు.