Jul 26,2022 16:58

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : జగ్గయ్యపేట రూరల్ మండలంలోని షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతిపరురాలు పఠాన్ బీబీ (75) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె గలరు. సిపిఎం  నాయకులు కోట కృష్ణ మృదేహంపై సిపిఎం జెండాను కప్పి  నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, నాయకులు షేక్ గౌస్ మియా, దంతాల వెంకటేశ్వర్లు ఎస్ రామనాథం పాల్గొన్నారు.