ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల వైయస్సార్ క్రాంతి పదం ఆఫీసు నందు డ్వాక్రా మహిళలకు జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి కోళ్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళల యొక్క జీవనోపాధిని మెరుగుపరచేందుకు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు పెరటి కోళ్ల పెంపకం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. శుక్రవారం నాడు మండలంలో వివిధ గ్రామాలలో 103 మంది లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ చేశారు. ఒక్కొక్క యూనిట్ కు ఎనిమిది పెట్టలు, మూడు పుంజులు మొత్తం 11 కోళ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కృష్ణ మరియు ఎన్టీఆర్ జిల్లా గౌరవ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ కిరణ్ కుమార్ ముఖ్యఅతిథిగా, ఎన్టీఆర్ జిల్లా హెచ్డి ఏపీఎం విక్టర్ ప్రకాష్ , మండల పార్టీ అధ్యక్షులు బలగాని తిరుపతిరావు ,రెడ్డిగూడెం సర్పంచ్ మల్లాది రాణి , వైస్ ఎంపీపీ రాబర్ట్,రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యులు కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి ,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కుప్పిరెడ్డి వెంకట్ రెడ్డి ,బత్తుల వెంకటేశ్వర రెడ్డి (పెదబాబు ), ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి ,రంగాపురం వెంకట రెడ్డి , రంగాపురం సర్పంచ్ పడిశాల సునీల , ఎఫ్ఈఓ ప్రెసిడెంట్ ఉయ్యూరు సత్యనారాయణ రెడ్డి , కో ఆప్షన్ సభ్యులు షేక్ గాలిబ్ సాహెబ్ , ఎమ్మార్వో పాల్ ,ఎంపీడీఓ శంకర్ రావు ,వెలుగు ఏపీఎం శ్రీనివాస్ ,మండల సమాఖ్య ప్రతినిధులు, వైఎస్ఆర్ క్రాంతి పద సిబ్బంది సీసీలు, ఆపరేటర్, అకౌంటెంట్, వివో ఏలు,తదితరులు పాల్గొన్నారు.










