Jul 28,2022 11:47

ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం (ఎన్‌టిఆర్‌) : ఇబ్రహీంపట్నం మండలం, రాయనపాడు గ్రామంలో నివాసం ఉంటున్న శాఖమురి కోటేశ్వరరావు ఇంటిలో తెల్లవారు జామున చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం అతని భార్య చనిపోవడంతో కోటేశ్వరరావు ఆరోగ్యం దెబ్బతిందని కుమారుడు తెలిపారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున దొంగలు ఇంటిలోకి ప్రవేశించి 13కాసులు బంగారం,2లక్షల 30వేల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. సమాచారం అదుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.