వాషింగ్టన్ : ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లు సంయుక్తంగా గురువారం మీడియాతో మాట్లాడనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఇది చాలా గొప్ప విషయమని వైట్ హైస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ పర్యటన ముగింపు సమయంలో మీడియా సమావేశంలో పాల్గొంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఇది చాలా ముఖ్యమైన సమావేశమని తాము భావిస్తున్నామని, ప్రధాని మోడీ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమని భావిస్తున్నందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో అమెరికా మీడియా నుండి ఒక ప్రశ్న, భారత జర్నలిస్టు నుండి మరో ప్రశ్న ఎదుర్కోనున్నారని కిర్బీ చెప్పారు.
ప్రధాని మోడీ అప్పుడప్పుడు మీడియా నుండి ఒక్కో ప్రశ్న ఎదుర్కొంటారు తప్ప.. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారికంగా ఒక్క మీడియా సమావేశంలో కూడా పాల్గొనలేదు. ఇతర ప్రపంచ నేతలతో వైట్‌హైస్‌లో మీడియా సమావేశాలు చాలా కఠినంగా నియంత్రించబడతాయని రాయిటర్స్ తెలిపింది. బైడెన్, ముఖ్య అతిథితో మీడియా సమావేశానికి రిపోర్టర్లను ముందుగానే నియమిస్తారు. చాలా పరిమిత సంఖ్యలో ప్రశ్నలు ఉంటాయని పేర్కొంది.










