పల్లవి :
జోహార్లు జోహార్లు జ్యోతిరావు పూలే
మా వేవేల దండాలు అందుకోండి నేడే .. జోహార్లు ..
చరణం : 1
బాలికల విద్యకై ఉద్యమించారు నాడే
వితంతువుల రక్షణకై నిలిచారు తోడే
స్వేచ్ఛ సమతలకై సాగించారు పోరే
గులాంగిరి రచనతో తెరిపించారు మా కళ్ళే //జోహార్లు//
చరణం : 2
మనువాదుల గుండెల్లో సింహ స్వప్నమయ్యారు
మనిషిని మనిషిగ చూడని జన్మమెందుకన్నారు
సమసమాజ స్థాపనే తన లక్ష్యమన్నారు
మహాత్ముడై ఇల వెలిసి మాలో నిత్య స్ఫూర్తి నింపారు
//జోహార్లు//
(నేడు జ్యోతిరావు పూలే జయంతి)
- గుండాల నరేంద్ర బాబు,
94932 35992










