వీళ్లు ..
నా కళ్లను
కాల్చిన ఇనపచువ్వలతో పీకేసారు !
ఈ చీకటికావల
వీళ్లు దోచుకున్న వెలుగురాశిని
నీకు చూపిస్తానేమోననీ ..!
వీళ్లు ..
నిషేధం నిట్టకు
నా పెడరెక్కలు విరిచి కట్టేసారు !
ఇంతటి విధ్వంసంలోకి
మనల్ని నడిపిస్తున్న నియంతల
పాదముద్రల్ని నీకు చూపిస్తానేమోననీ ..!
ఐనా .. దిగులు పడకు !
రేపటి తూరుపు తావి మీద
సూరీడికి బదులు
వీళ్లు ఖండించిన నా శిరస్సు విరబూస్తుంది !
ఆ వేళ ..
నేనే వెలుగు రెక్కలతో
నీ ముంగిట వాలతాను!
- సిరికి స్వామినాయుడు
94940 10330










