Mar 24,2022 18:39

బాలలు బడికి రావాలి
ఆడుతూ పాడుతూ చదవాలి
చక్కగా పాఠం వినరండి
హాయిగా మీరు ఉండండి

బడి అంటే ఆట పాట
స్నేహితులతో కుస్తీలంట
అందరూ కలిసి తినండి
సంతోషంగా ఉండండి

బడి అంటే విజ్ఞానం
బడి అంటే ఆనందం
బడిలో ఉండు విరుల తోట
పిల్లలందరికి కనువిందంట

భవితను దిద్దే బడి
పిల్లలకు మరో అమ్మ ఒడి
బడి అంటేనే పిల్లల సందడి
మంచిని పెంచే చల్లని సన్నిధి
యాడవరం చంద్ర కాంత్‌ గౌడ్‌
94417 62105