విప్లవాల వీర వనిత మా మల్లు స్వరాజ్యం
తెలంగాణ పోరుబిడ్డ మా మల్లు స్వరాజ్యం
అందుకో జోహార్లు ఐద్యా నాయకురాలా ..
ఇక సెలవంటూ మమ్ము విడిచి నీవు వెళ్లిపోయావా!
భూస్వాముల, భూర్జువాల దాష్టీకాలనెదిరించగ
సాయుధ పోరాటంలో ఆయుధాన్ని పట్టావు
రజాకార్ల రాజ్యంలో ఎదురు తిరిగి నిలిచావు
పేద ప్రజల హక్కులకై పోరుబాట పట్టావు
మార్క్సిస్టుల ఆశయాలు పుణికి పుచ్చుకున్నావు
కడవరకు నీ పయనం ఎన్నో త్యాగాలమయం
అణగారిన ప్రజలకెపుడు నీ బతుకొక ఆదర్శం
విప్లవాల పూతోటలో వికసించిన మందారం
పోరాటాలతో నీకు అలుపెన్నడు లేదమ్మా
దు:ఖసాగరంలో మమ్ము విడిచి వెళ్ళావా అమ్మా
మా కంటికి నీవింక కనిపించక పోయినా
ఎర్రజండలోన అరుణ తారై ఎగిరేవమ్మ ...
వాడాడ చంద్రశేఖరరావు
శ్రీహరిపురం, విశాఖపట్నం










