Mar 24,2022 09:48

తల్లిగా చెల్లిగా
జన మనుగడకు
బానిస బతుకుల
విముక్తికై
నిజాం నిరంకుశ పాలన
పై తుపాకీ పట్టిన
వీర వనతి మల్లు స్వరాజ్యం
స్వేచ్ఛ సమతా మానవత
సమ్మతంగా తుది దాకా
పోరు సల్పిన మహిళామణి
మరువదు మీ పోరాట స్ఫూర్తిని
అందుకోమ్మా శ్రమ శక్తుల అరుణాంజలి!

పాటిబండ్ల స్వరాజ్య లక్ష్మి,
సీతానగరం, తాడేపల్లి, గుంటూరు జిల్లా