Feb 01,2021 10:46

విజయనగరం: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో వున్న అంబేద్కర్‌ కాలనీలో సోమవారం తెల్లవారుజామున జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డా.జి.సి. కిషోర్‌కుమార్‌ ప్రారంభించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, రాష్ట్రంలోనే ఈ పథకం కింద బియ్యం అందుకున్న మొట్టమొదటి కార్డుదారుగా నమోదైన నగరంలోని మూడో నంబరు రేషన్‌ డిపోకు చెందిన కోటిపల్లి ఉమ అనే మహిళకు పంపిణీ చేశారు.