Jan 22,2023 20:47

ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - సోమందేపల్లి : స్థానిక నక్కల గుట్ట ఇండ్ల స్థలాల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలకు అనుమతించాలని తహశీల్దార్‌ ఏర్పాటు చేసిన నోటీసు బోర్డును తక్షణం తొలగించేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో బాధిత లబ్ధిదారులు స్థానిక ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దన్న మాట్లాడుతూ వివిధ కారణాలు , ఆర్థిక ఇబ్బందుల వల్ల సకాలంలో పేదలు ఇల్లు నిర్మించుకోలేకపోయారన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత పట్టాదారులలో అనర్హులు ఉన్నారంటూ నిర్మాణ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారన్నారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం బాధితులు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అయితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తహశీల్దార్‌ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారని వాపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు హనుమయ్య, వెంకటేష్‌, రంగప్ప, గంగరాజు, మాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి, సిఐటియు మండల నాయకులు కొండా వెంకటేష్‌ , నాగభూషణ, చేనేత కార్మికులు శీలా నారాయణస్వామి, బేల్దారి వెంకటేష్‌ , రామాంజి, లబ్ధిదారులు లీలావతి, షాహినా, రామాంజనేయులు, చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీనివాసులుతో పాటు 50 మంది బాధిత లబ్ధిదారులు పాల్గొన్నారు.