Jan 24,2023 22:23

టమోటా పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌, తదితరులు

తనకల్లు : మండలంలోని తనకల్లు-3 రైతు భరోసా కేంద్రం పరిధిలోని కుంటమరవలో మంగళవారం చేపట్టిన ఈపంట నమోదును కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ పరివృలించారు. గ్రామానికి చెందిన జి. షాహినా అనే రైతు టమాటో పంట పొలాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి పంటసాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వైవి.సుబ్బారావు, ఎడిఎ సత్యనారాయణ, ఎఇఒ నయాజ్‌, వాలెంటీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నంబులపూలకుంట : మండల పరిధిలోని మొలకలవారి పల్లికి చెందిన వెంకట రమణారెడ్డి పొలంలో సాగు చేసిన టమోటా పంట పొలాన్ని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. పంటసాగుకు అయిన పెట్టుబడి, ప్రస్తుతం ఉన్న ధర తదితర వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రైతు తన సమస్యను వివరించారు. మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో పంటసాగు చేసినట్లు చెప్పారు. అయితే గిట్టుబాటు ధర లేకపోవటంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయారు. గ్రామంలో నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం నిర్వహణపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిలా వ్యవసాయ శాఖాధికారి వైవి. సుబ్బారావు, ఎడిఎ సత్యనారాయణ, తహశీల్దార్‌ రవినాయక్‌, ఎఒ లోకేశ్వరరెడ్డితో పాటు రైతులు, తదితరులు పాల్గొన్నారు.