Jan 21,2023 16:35

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌ (బాపట్ల జిల్లా) : హేతువాద, మానవవాద ఉద్యమ రూపకర్త రావిపూడి వెంకటాద్రి (101) శనివారం తుది శ్వాస విడిచారు. వయోభారంతో చీరాలలో ఆయన కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఇంకొల్లులోని రాడికల్‌ హ్యూమనిస్ట్‌ సెంటర్‌లో సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామం నాగండ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1922లో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన రావిపూడి 1940లో త్రిపురనేని రామస్వామి రచించిన సాంబుకవాదాన్ని చదివి హేతువాద ఆలోచనల వైపు మళ్లారు. సైన్స్‌, మతం, హేతువాదం, మార్క్సిజం, భౌతికవాదం, నాస్తికత్వం, ఇతర విషయాలపై తెలుగులో విస్తృతంగా రచనలు రాశారు. హేతువాది తెలుగు మాస పత్రికను స్ధాపించి ప్రస్తుతం ఆ పత్రికకు చైర్మన్‌గా ఉన్నారు. హేతువాదం అనే శీర్షికతో హేతువాదంపై పుస్తకం రాసిన మొదటి రచయిత ఆయనే. రావిపూడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య గతంలోనే చనిపోయారు.