Mar 01,2023 21:28

గ్యాస్‌ మంట!


సిలిండర్‌పై రూ.50 పెంపు
జిల్లాపై రూ.3.5 కోట్ల భారం
ప్రజాశక్తి - కడప ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్‌ ధరలను పెంచేసింది. 2022 జులై ఐదున సిలిండర్‌కు రూ.50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎనిమిది నెలల వ్యవధిలో మరోసారి రూ.50 పెంచడం చర్చ నీయాంశంగా మారింది. 2022 మార్చి, మే ఏడు, జులై ఏడు, తాజాగా మార్చి నెలలతో కలిపి లెక్కిస్తే నాలుగు దఫాలకుపైగా పెంచింది. వరుస ధరల పెరుగుదల ఆయిల్‌ కంపెనీలకు లాభాల పంటను పండిస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో గ్యాస్‌ ధర లను పెంచుతోంది. తాజాగా బుధవారం ఉదయం గ్యాస్‌ ధరలను పెంచేసింది. ఫలితంగా జిల్లాపై నెలకు సుమారు రూ.3.5 కోట్ల మే రకు భారం పడనున్నట్లు ఓ అంచనా.
కేంద్రప్రభుత్వం వంటింట్లో మంట పెట్టింది. బుధవారం ఉద యం డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరను రూ.50 మేరకు పెంచేసింది. ప్రకటిత రోజు నుంచి రూ.50 గ్యాస్‌ ధరను అమలు చేయ నుం ది. ఫలితంగా గృహిణుల ఖాతాలకు చిల్లుపెట్టింది. ఒకవైపు నిత్యా వసరాలు, కూరగాయల ధరలు మండుతుండగా, మరోవైపు గ్యాస్‌ ఛార్జీల రూపంలో మహిళల మనీ ప్యాకెట్లను ఖాళీ చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని 8.12 లక్షల కుటుంబాలపై పెనుభారం పడింది. 2021 ఫిబ్రవరి, మార్చి, జులై, 2022 మార్చి 23, మే, జులై, 20 23 మార్చి మాసాల కలిపితే ఏడు దఫాలుగా రూ. 325 మేరకు ధరలను పెంచేసింది. ఈనేపథ్యంలో జిల్లాలో భారత్‌, హెచ్‌పి, ఇండే న్‌ గ్యాస్‌ ఏజె న్సీలు గ్యాస్‌ సరఫరా కార్యకలాపాలను సాగిస్తున్నా యి. జిల్లాలో 8,12, 013 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా సు మారు ఎనిమిది లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు అంచనా. ఇం డేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ సుమారు నాలుగు లక్షలు, హెచ్‌పిసిఎల్‌ 2.64 లక్షలు, బిపిసిఎల్‌ 1.26 లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. రోజుకు సగటున 28 వేల చొప్పున నెలకు ఎనిమిది లక్షల సిలిండ ర్లు వినియోగమవుతున్నట్లు అంచనా. గతంలో సిలిండర్‌కు రూ. 1050 చొప్పున సిలిండర్‌ను చెల్లించాల్సి వచ్చేది. తాజా పెంపుద ల తో రూ.1,155 చేరుకుంది. గతంలో గ్యాస్‌ సబ్సిడీ కస్టమర్ల ఖా తాల్లో జమ చేసేలా మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కానీ చాలా మంది కస్టమర్ల ఖాతాల్లో సబ్సిడీ జమ కావడం లేదనే వాదన వినిపి స్తోంది. సబ్సిడీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లో జమ చేయకపో వడం, మరోవైపు ఉన్న ఫళంగా గ్యాస్‌ ధరలను పెంచండం పట్ల ఆం దోళన వ్యక్తమవుతోంది. రెండేళ్ల నుంచి గ్యాస్‌ ధరల పెంపు వివరా లను ఓసారి పరిశీలిస్తే 2021 ఫిబ్రవరి 4న రూ.25, మార్చి 15న రూ.50, జులై 25న రూ.25,2022 మార్చి ఒకటిన రూ.25, మార్చి 23న రూ.50, మేఏడున రూ.50, జులై7న తాజాగా రూ.50 చొప్పన పెంచుతూ పోయింది. ఫలితంగా సిలిండర్‌ ధరకు రవాణా ఛార్జీని రూ.40 కలిపితే రూ.1,195 ముట్టజెప్పుకోవాల్సి వస్తోంది. ఈలెక్కన జిల్లాపై సుమారు రూ.3.5 కోట్ల వరకు భారం పడుతున్నట్లు ఓ అంచనా.